డిసెంబర్ 31 తేది దగ్గర పడటముతో అటు సీమంద్రలోను, తెలంగాణా లోను నాయకుల హడావిడి మోదలైయీంది. దానికి తోడుగా ప్రభుత్వమూ కూడా కేంద్రమునుండి ప్రత్యెక బలగాలను రప్పించటం పరిస్తితులు ఉద్రిక్తము గా ఉండే అవకాసము ఉంది.
తెలంగాణపై శ్రీకృష్ణ కమిటీ విడుదల చేసే నివేదికపై న్యూస్ ఛానెల్స్ అతిగా స్పందించకూడదని న్యూస్ బ్రాడ్‌క్యాస్టర్ అసోసియేషన్ (ఎన్‌బీఏ) కోరింది. శ్రీకృష్ణ కమిటీకి సంబంధించిన ఏ విషయాన్నైనా సంచలన రీతిలో ప్రసారం చేయడం కాని, రెచ్చగొట్టే విధంగా కాని ఉండకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని ఎన్‌బీఏలో సభ్యులైన ఎడిటర్లకు విజ్ఞప్తి చేసింది.
సమాజ శ్రేయస్సును, స్థానిక అంశాలను దృష్టిలో వుంచుకొని ప్రాథమిక మార్గదర్శక సూత్రాల కనుగుణంగా వార్తలు ప్రసారం చేయాలని న్యూస్ చానెల్స్‌ను కోరింది. అంతేకాక శ్రీకృష్ణ కమిటీ నివేదిక తదనంతర రేకేత్తే పరిస్థితులను, అనుకూల, ప్రతికూల ఊరేగింపులను, హింస దృశ్యాలను, స్క్రోలింగ్స్, ఆత్మాహుతి దృశ్యాలను చూపించకూడదని ఆంక్షలు విధించింది.
రేపు సీమంద్ర యునివర్సిటీ విద్యార్దుల ఐక్య కర్యచన సమితి బేటి కి పిలుపునిచారు, ఈ బేటి లో సీమద్రలో కృష్ణ కమిటీ రిపోర్ట్ మీద ఉద్యమ ప్రణాళికలు రచించ బోతున్నారు. రానున్న రోజులలో రాష్ట్రము మరల ఉద్యమాలతో ప్రజా జీవితానికి సంకటముగా మారబోతుంది!
